![]() |
![]() |

'బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎంత చక్కగా ఉందో సీజన్ 6 అంత చెత్తగా వుంది. ఈ సీజన్ చూసిన ఆడియన్స్ కి దీని మీద అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. హోస్టింగ్ లో పస లేదు. కంటెంట్ లేదు. సీజన్ 1 కంటెంట్ ని సీజన్ 6 కంటెంట్ ని పక్క పక్కన పెట్టి చూస్తే అర్ధమవుతుంది.'.. ఈ మాటలన్నీ అన్నది మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ సమీర్.
రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. "అసలు ఏమిటి ఈ బిగ్ బాస్ షో.. ఏమిటి ఆ గోల.. అలాంటి షోని ఎందుకు చూస్తారో కూడా తెలియదు? ఏంటో వాళ్లలో వాళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అసలు ఏమిటి ఈ న్యూసెన్స్?" అని యాంకర్ షాకింగ్ కామెంట్స్ చేసేసరికి.. సమీర్ నవ్వి " మా సీజన్ లో అలా లేదు. కానీ ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్ ఐపోయినట్టు కనిపిస్తోంది." అన్నారు.
"ఐతే మా సీజన్ 1 బిగ్ బాస్ సెట్ పూణే పక్కన ఉన్న లోనావాలా కొండల్లో, అడవుల్లో వేశారు మా సెట్. సీజన్ 2 నుంచి హైదరాబాద్ కృష్ణనగర్ లోనే సెట్ వేస్తున్నారు. మా సెట్ అడవిలో ఉండేది కాబట్టి అప్పుడు ఒక పిచ్చుక వచ్చి తిరిగినా కూడా అందరం బయటికి వచ్చి చూసేవాళ్ళం. ఆ టైములో బిగ్ బాస్ హౌస్ లో మా పనులు మేమే చేసుకునేవాళ్లం. మా సీజన్ లో సంపూర్ణేష్ బాబు..ఇక్కడి వాతావరణం సరిపడక ఏడ్చేసి గోల చేసాడు. సంపూర్ణేష్ బాబు పల్లెటూరు నుంచి వచ్చిన అతను. ఏదైనా మూవీ షూటింగ్ ఉన్నప్పుడు అది అయిపోగానే మళ్లీ ఇంటికి వెళ్లిపోతాడు తప్ప హైదరాబాద్ లో ఉండనే ఉండదు.. పల్లెటూరు వాతావరణం అంటేనే సంపూర్ణేష్‌కి ఇష్టం. అలాంటి అతన్ని తీసుకొచ్చి.. బిగ్ బాస్ లాంటి ఒక హైఫై గదిలో బంధించేసరికి తట్టుకోలేకపోయాడు. ఒకవారం తట్టుకున్నాడు కానీ.. వారం అయిన తరువాత అతని మైండ్ డిస్ట్రబ్ అయ్యింది. అందుకే వింత వింతగా ప్రవర్తించి.. నన్ను ఇక్కడ నుంచి పంపించకపోతే..తలుపు పగలగొట్టుకుని వెళ్లిపోతా అని ఏడ్చాడు." అని తెలిపారు.
"కానీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్లు పంపించినప్పుడే బయటికెళ్ళాలి. మనకు మనం బయటికి వెళ్ళాలి అంటే రూ. 25 లక్షలు కట్టి రావాలి. అయినా సంపూ కూడా ఆ డబ్బు కట్టడానికి రెడీ అయ్యాడు కానీ ఆ టైములో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. తిండి తినేవాడు కాదు.. నిద్ర పోయేవాడు కాదు. దీంతో మా సీజన్ హోస్ట్ తారక్.. బిగ్ బాస్ వాళ్లతో మాట్లాడి అతన్ని అలా ఉంచొద్దు.. బయటకు పంపేద్దాం.. రూ.25 లక్షలు కట్టమనడం పద్ధతి కాదని మాట్లాడి సంపూని బయటకు పంపించాడు. అంతే తప్ప అది స్క్రిప్టెడ్ కాదు.. రియల్" అంటూ చెప్పుకొచ్చారు సమీర్.
![]() |
![]() |